నెల్లూరులోని వెంకటేశ్వరపురం సెంటర్లో బుధవారం సాయంత్రం గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బాబు అనే వ్యక్తిని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచారు. బైక్ పై వెళ్తూ పడిపోయిన వారిని బాబు పైకి లేపగా, వారు కత్తితో దాడి చేసి, అక్కడి దుకాణదారులను బెదిరించి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.