నెల్లూరు: జోరు వానలో పింఛన్లు పంపిణీ చేసిన కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ పరిధిలోని 28వ డివిజన్ కేశవులనగర్ లో సోమవారం జోరు వానలో సైతం ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పింఛన్లు అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం 4 వేలు పెన్షన్ అందిస్తున్న మంచి ప్రభుత్వం తమదని, పెన్షన్ల పంపిణీ విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉదారంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రజల ఆశీస్సులు మరింతగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్