నెల్లూరు: పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువు కోవూరు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 ఎంఎస్ఎంఈ పార్కులకు సోమవారం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో, కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో నూతన ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్