జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 17న నిర్వహించే జాతీయ మహాసభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పెరుమాళ్ళ పద్మజ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరులో ఆమె సోమవారం మాట్లాడుతూ బీసీల హక్కులతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. జాతీయ మహాసభకు జిల్లా నుంచి తరలిరావాలన్నారు.