నెల్లూరు: 17న జరిగే బీసీ సంఘ జాతీయ మహాసభను విజయవంతం చేయండి

ఈనెల 17న విజయవాడ తుమ్మలపల్లి కలక్షేత్రంలో నిర్వహిస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘ జాతీయ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరు రాధే గెస్ట్ ఇన్ లో శుక్రవారం జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నూతన కమిటీలను ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో ఆవుల నరసింహం, జిల్లా అధ్యక్షులు బొమ్మి నాగ కిషోర్, దేవరాల, పద్మజ యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్