నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతిని పదవి నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 18వ తేదీ ఉదయం 11:30 గంటలకు నగర కార్పొరేషన్ కౌన్సిల్ హాల్‌లో అవిశ్వాస తీర్మానంపై సర్వసభ్య సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లలో 42 మంది టీడీపీకి మద్దతుగా ఉన్నందున, అవిశ్వాస తీర్మానం సులభంగా నెగ్గే అవకాశం ఉంది.