పేదలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు లోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నారాయణ పంపిణీ చేసారు. 10 డివిజన్లలోని 10 మందికి 19, 98, 348 రూపాయల చెక్కులను మంత్రి అందచేసారు. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు.