ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ బయో ఎనర్జీ ప్రోగ్రామ్ కింద అందించిన సహాయాన్ని తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం లోక్‌సభలో ఈ మేరకు జాతీయ బయోఎనర్జీ ప్రోగ్రామ్ పై పలు వివరాలు ఆరా తీశారు. ఏపీలో జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తున్న బయో ఎనర్జీ ప్రాజెక్టుల వివరాలను ఆయన అడిగారు.