వరదతో నెల్లూరు అతలాకుతలం

దిత్వా తుఫాను కారణంగా నెల్లూరు నగరం తీవ్రంగా ప్రభావితమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో వరద నీరు ప్రవహించింది. శుక్రవారం నాటికి ప్రధాన రహదారుల్లో నీరు తగ్గినా, బుజబుజ నెల్లూరు, వైయస్సార్ నగర్, చంద్రబాబు నగర్, సుందరయ్య కాలనీ, వనంతోపు సెంటర్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకా నిలిచే ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్