నెల్లూరు: బీసీ మహిళా విభాగంలో నూతన నియామకాలు

బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలుగా ఉడతా శైలజ యాదవ్, జిల్లా కార్యదర్శిగా విజయలక్ష్మికి రాష్ట్ర మహిళా అధ్యక్షులు పెరుమాళ్ల పద్మజ యాదవ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. బుధవారం నెల్లూరు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జిల్లాలో బిసి సంక్షేమ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. వల్లెపు రజిని, అన్నంగి రమణయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్