నెల్లూరు: అలపర్తి విద్యాసాగర్ ప్యానల్ కు ఎన్జీఓ ల మద్దతు

బుధవారం నెల్లూరు ఎన్జీవో హోంలో జరిగిన ఏపీ ఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఫిబ్రవరి 8న జరిగే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర అధ్యక్షులుగా అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శిగా డివి రమణ ప్యానల్‌కు నెల్లూరు ఏపీ ఎన్జీవోల సంఘం మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తాలూకా అధ్యక్ష కార్యదర్శులు, మహిళా వింగ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్