మొంథా తుపాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నష్టపోయిన రైతులకు అందించాల్సిన సాయంపై మాట మాత్రమైనా ప్రకటన చేయని చంద్రబాబు, తుపాన్ లో అంతా బాగా చేసామని సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి అచ్చం నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హితవు పలికారు.