నెల్లూరు: ఆన్‌లైన్‌లో వల.. కోట్లు స్వాహా..

విజయవాడ సైబర్ పోలీసులు అద్దంకికి చెందిన ఒక మోసగాడిని అదుపులోకి తీసుకున్నారు. నౌకరి, మాట్రిమోని వంటి వెబ్‌సైట్ల నుండి ఫోన్ నంబర్లను సేకరించి, పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసేవాడు. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక అమ్మాయి వద్ద రూ.44 లక్షలు, నెల్లూరు జిల్లాకు చెందిన అమ్మాయిల వద్ద రూ.8 లక్షలు, ఇలా మొత్తం 100 మంది బాధితుల నుండి రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని కాజేశాడు. విజయవాడకు చెందిన ఒక అమ్మాయికి సాఫ్ట్‌వేర్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి, ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసగాడి బండారం బయటపడింది.

సంబంధిత పోస్ట్