గురువారం శాంతినగర్ లోని కార్యాలయంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మలి రెడ్డి కోటారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శిఖరం నరహరి, నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోట శ్రీనివాసుల రెడ్డి, ఉడుత రాజశేఖర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు కె. వి రామ్మోహన్ రెడ్డి, షేక్ మున్నా, బాబి భగత్ తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.