నిత్యం అంబేద్కరిస్టులతో ఉండే నెల్లూరు కొండయ్య పాలెం గేట్ అంబేద్కర్ భవన్ లో పోలీసుల లాఠీ చప్పుళ్లు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి దగ్గరలోనే అంబేద్కర్ భవనం ఉండటంతో ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు.