మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున పికెట్లు, బారికేడ్లు ఏర్పాటుచేసి అడ్డుకుంటున్నారు. గురువారం నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జునను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నేతలు ప్రశ్నించారు.