కావలి మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ అవినీతిని ప్రశ్నించినందుకు తనను అక్రమంగా బదిలీ చేశారని వెంటనే దీనిని రద్దు చేయాలని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్ డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ కోరుతూ ఉద్యోగి బుధవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భాస్కర్ మీడియాతో పలు విషయాలను వెల్లడించారు.