నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి కుళాయి కనెక్షన్లను క్రమబద్ధీకరించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కమిషనర్ వై. ఓ నందన్ ఆదేశించారు. గురువారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశం మందిరంలో ఇంజనీరింగ్ విభాగం, హౌసింగ్ , టిడ్ కో అధికారులు, వార్డు సచివాలయ అమెనిటీస్ కార్యదర్శులతో వారాంతపు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.