ప్రజా సమస్యలపై స్థానిక నేతలు తక్షణం స్పందించి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 36వ డివిజన్ లో ప్రజలతో శనివారం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఎవరి సిఫారసు అక్కర్లేదు జనానికి మంచి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ షంషుద్దీన్, కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ, పాల్గొన్నారు.