నెల్లూరు: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఏపీ పిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, ఆర్టీసీలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ఎన్జీవో హోం లో మంగళవారం జరిగిన జిల్లా యువభాగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో 48 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, సుమారు 60 లక్షల మందిని ప్రతినిత్యం గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు చెంచయ్య, కేపీ రెడ్డి, మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్