నెల్లూరు కల్లూరుపల్లిలో ఈ నెల 28న జరిగిన పెంచలయ్య హత్య కేసులో, ప్రధాన నిందితురాలు అరవ కామాక్షమ్మతో సహా మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆదివారం మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. సిపిఎం కార్యకర్త కె. పెంచలయ్య (38) ఆర్డిటీ కాలనీలో నివాసం ఉంటూ, ఆ ప్రాంతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తులు ఉండకూడదని అవగాహన కార్యక్రమాలు నిర్వహించేవారు. అరవ కామాక్షి తన వ్యాపార ప్రయోజనాల కోసం పెంచలయ్యపై కక్ష పెంచుకుని ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.