నెల్లూరు: పెన్షన్ లు పంపిణి చేసిన సోమిరెడ్డి

శనివారం మనుబోలు మండలంలోని జట్లకొండూరు, మడమనూరులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. జట్లకొండూరులో జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మనుబోలు మండలంలో ప్రతి నెలా 5564 మందికి పింఛన్లు అందిస్తున్నామని, దీనికోసం నెలకు రూ. 2.40 కోట్లు, ఏడాదికి రూ. 30 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం నెలకు రూ. 2700 కోట్లు, ఏడాదికి రూ. 33 వేల కోట్లు ఖర్చు చేయడం దేశంలోనే ఒక చరిత్ర అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్