నెల్లూరు: ప్రతి ఇంటా పించన్ల వెలుగులు: నారాయణ

నెల్లూరు 54వ డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తెల్లవారుజామునే తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి నారాయణ, కమీషనర్ నందన్, ఇంచార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ లకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం చంద్రబాబు నాయుడు అండగా నిలిచారని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత పోస్ట్