నెల్లూరు: పవిత్రతను దెబ్బతీస్తున్నారు: కాకాణి

తిరుమల తిరుపతి దేవస్థానంలో వరుస అపచారాలతో స్వామివారి పవిత్రతను కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోందని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తిరుమల కొండపై మద్యం, రీల్స్, ఫోటో షూట్లు వంటి నిషిద్ధ కార్యకలాపాలు పెరిగిపోయాయని, భక్తుల రక్షణపై పాలకమండలికి నియంత్రణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామివారి పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు.

సంబంధిత పోస్ట్