నెల్లూరు: కత్తులతో బెదిరించి, ఫోన్ పేతో నగదు బదిలీ

నెల్లూరులో ఐదుగురు వ్యక్తులు కత్తులతో బెదిరించి రూ.5 వేలు ఫోన్ పే ద్వారా దొంగిలించిన ఘటన జరిగింది. వెంకటాచలం మండలం కాకుటూరుకు చెందిన నాగేంద్ర బీవీ నగర్ బేకరీలో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం తల్పగిరి కాలనీ వద్ద అతడిని నిందితులు ఆపి బెదిరించారు. డబ్బులు లేక ఫోన్ పే ద్వారా నగదు పంపించగా, వెళ్లిపోయారు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్