నెల్లూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగిన బస్సు డ్రైవర్, కండక్టర్ పై బ్లేడుతో దాడి ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నెల్లూరు నగర ఇన్చార్జి డిఎస్పి గిరిధర్ తెలిపారు. సంతపేట పోలీస్ స్టేషన్లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బైకు పార్కింగ్ విషయమై వివాదం తలెత్తడంతో ఐదుగురు ఈ దాడికి పాల్పడ్డారని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు.