నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చొరవతో రామలింగాపురం అండర్ బ్రిడ్జి వద్ద సిమెంటు రోడ్డు, ఫ్లాట్ ఫారం, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆధునీకరణ పనుల వల్ల భారీ తుఫానులోనూ వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతున్నాయి. గతంలో చిన్నపాటి వర్షానికే ఇక్కడ నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడేది. ఇప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.