వైఎస్‌ జగన్‌ చేసిన ఆరోపణలపై స్పందించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనపై చేసిన ఆరోపణలపై స్పందించారు. కనుపర్తిపాడులోని విపిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అప్పన్న అనే వ్యక్తి కుటుంబానికి జరుగుబాటు లేకపోవడంతోనే తాను సేవా భావంతో రూ. 50 వేలు చెక్కు ఇచ్చానని స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్‌ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారని, తాను ఏంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నానన్నారు. ఎవరు చెబితే తాను ఇచ్చానో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్