సభ్య సమాజం తలదించుకునేలా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యలు వైసీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని టిడిపి కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంతిరెడ్డిపై నీచపు మాటలను ప్రోత్సహించిన అనిల్ కుమార్ యాదవ్‌లను మహిళా లోకం చీదరిచుకుంటోందన్నారు.