జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గురించి తప్పుడు పోస్టింగులు పెడితే సహించేది లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు అన్నారు. సోమవారం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన జనసేన నాయకులతో కలిసి నెల్లూరు వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జనసేన జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా పాల్గొన్నారు.