నెల్లూరు రూరల్ కోడూరుపాడులోని 1/2 సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ దోభా పార్వతి, తోటి ఉద్యోగి త్రివేణతో కలిసి గత నెల 31న పింఛన్ నగదును తీసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన వివాదంలో స్థానిక మహిళా పోలీసు కూరపాటి మాధురి, పార్వతిపై దాడి చేశారు. ఈ దాడిలో పార్వతికి గాయాలవడమే కాకుండా, కార్యాలయానికి చెందిన రెండు సెల్ ఫోన్లు పాడై, వాటిలోని డేటా ధ్వంసమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.