ఎమ్మెల్యే టికెట్ కోసం అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని నెల్లూరు నగర టీడీపీ నేత కేతంరెడ్డి శుక్రవారం ఎద్దేవా చేశారు. అనిల్ వల్లే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. ఆయనను చచ్చిన పాముగా అభివర్ణించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలను ప్రతీఒక్కరు ఖండిస్తున్నారనీ, కర్ణాటకలో అనిల్‌కు, తమిళనాడులో ప్రసన్నకు ఎమ్మెల్యే సీటు ఖాయమంటూ విమర్శించారు.