నెల్లూరులో హోటళ్లపై ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల సాంబారులో బల్లి వచ్చిన ఘటన మరవకముందే, శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ హోటల్లో చపాతీ కర్రీలో బొద్దింక కనిపించింది. దీనిపై కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని వాపోయాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు.