వెంకటాచలం మండలం బురన్పూర్లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన నార్తు రాము (15) అనే బాలుడు నెల్లూరు పొగతోటలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం 7వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడు. సెలవుల్లో కూలీ పనులకు వచ్చిన రాము భవనంపై నుంచి జారి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.