ఎన్టీఆర్ 103వ జయంతి: భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. నెల్లూరులో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. దేశానికి, తెలుగుజాతికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మహానాడు ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంబంధిత పోస్ట్