నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, పలువురు అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం డిఆర్ఓ విజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త నిర్వచనం ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు.