నెల్లూరులో ఘనంగా పీ4 వార్షికోత్సవం

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మార్గదర్శి - బంగారు కుటుంబం (పీ4) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన P4 ద్వారా పేదల ఆర్థిక స్థితిగతులను మార్చడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్