నెల్లూరు జిల్లా కలిగిరిలో రోడ్డు మీద బొప్పాయి రైతులు బైఠాయించి గురువారం ఆందోళన చేపట్టారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డు మీద బొప్పాయి పంటను దగ్ధం చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ బొప్పాయి రైతులు డిమాండ్ చేశారు. కనీస గిట్టుబాటు ధర లేక బొప్పాయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని బొప్పాయి రైతులను ఆదుకోవాలని కోరారు.