పామూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మారెడ్డిపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై మరమ్మతులకు గురై ఆగిపోయింది. దీంతో అందులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడిరోడ్డుపై పిల్లా పాపలతో మండుటెండలో సుమారు 2 గంటల పాటు మరో బస్సు కోసం ఎదురుచూశారు. కండిషన్ లేని బస్సులతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.