ఈనెల 30 లోపు ఆస్తి పన్నులు చెల్లించండి: కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని భవన యజమానులు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను, ఖాళీ స్థల పన్నులను ఈ నెల 30 లోపు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని కమిషనర్ వై. ఓ నందన్ సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తాగునీటి కుళాయి పన్ను, డ్రైనేజీ పన్నులు, ఇతర మున్సిపల్ పన్నులను కూడా చెల్లించాలని ఆయన నగర ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్