నెల్లూరు ప్రాజెక్టులోని పెద్దతోట 1, 2, గొల్లవీధి మరియు 1, 2 అంగన్వాడీ కేంద్రాలను ఐసిడిఎస్ పిడి హేనసుజాన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె పలు రికార్డులు, ప్రెస్కూల్ మెనూ, హాజరు వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐవిఆర్ఎస్ కాల్స్ గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. జూన్ 1వ తేదీ నుంచి 'అంగన్వాడీ పిలుస్తుంది' అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.