నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

నెల్లూరు రూరల్ మండలంలోని కాకుపల్లి గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజుకుమారి అందజేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాకుపల్లి మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కోసూరు కేశవులు, కుంచనపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్