పొదలకూరు: కోటి సంతకాల సేకరణ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసిపి చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన లభిస్తోందని మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం పొదలకూరు మండలంలోని బిరదవోలులో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం పేదలకు వైద్యం, వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్