ఘనంగా రెడ్ల ఐక్యవేదిక కార్తీక వనభోజనం మహోత్సవం

నెల్లూరు రూరల్ పరిధిలోని చింతా రెడ్డిపాలెం విహాన్ ఆగ్రో ఫార్మ్స్ లో ఆదివారం రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి హాజరయ్యారు. రెడ్ల ఐక్యవేదిక అధ్యక్షుడు నిర్మల నరసింహారెడ్డి, కార్యదర్శి ప్రతాపరెడ్డి, శక్తి గ్రాఫిక్స్ మల్లికార్జున్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ, అందరూ ఒకచోట సమావేశమై కార్తీక వనభోజన కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు.

సంబంధిత పోస్ట్