మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక పొదలకూరు రోడ్డు జంక్షన్ నుంచి సుజాతమ్మ కాలనీ అంబేద్కర్ భవనం వరకు వెళ్లే రహదారిని పోలీస్ అధికారులు గురువారం క్లోజ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఇన్చార్జి ఎస్పీ దామోదర్ పర్యవేక్షిస్తున్నారు.