నెల్లూరు రెడ్ క్రాస్ లో సంక్రాంతి వేడుకలు

నెల్లూరు జిల్లాలోని ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎమ్మెస్సార్ స్పాస్టిక్ సెంటర్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆవరణలో ముత్యాల ముగ్గులు, పూల అలంకరణలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, స్పాస్టిక్స్ సెంటర్ కో ఆర్డినేటర్ దాసరి రాజేంద్రప్రసాద్ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను పిల్లలకు వివరించారు. పలువురు రెడ్ క్రాస్ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్