నెల్లూరు నగరంలో ఆరవ డివిజన్లోని పప్పులు వీధిలో, ముక్కాల ద్వారకానాద్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొని, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు సంక్రాంతి కానుకగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న నేతలకు మంత్రి అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముందు, చిన్నారులు, ఆర్యవైశ్య నాయకులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో మంత్రి నారాయణకు స్వాగతం పలికారు.