మనుబోలు మండలంలోని వడ్లపూడి గ్రామంలో గురువారం జరిగిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి దంపతులిద్దరూ కలిసి పర్యటించారు. గ్రామంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అనంతరం వడ్లపూడి ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొని విద్యారంగంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పులను వివరించారు.