విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. వెంకట సుబ్బారెడ్డిలు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘సేవా రత్న అవార్డు – 2025’ను అందుకున్నారు. ఆల్ ఇండియా సుమన్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారాలు విశ్వవిద్యాలయానికి గౌరవాన్ని తెచ్చాయి.