మహిళలు, బాలికలపై నేరాలను అరికట్టడానికి, బాధితులకు త్వరగా న్యాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ దండాయన' కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. మహిళల భద్రత విషయంలో రాజీ ఉండదని, నేరస్థులు ఎంతటి పలుకుబడి కలిగిన వారైనా చట్టం ముందు తప్పించుకోలేరని ఆమె స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ఆపరేషన్ దండాయన' పోస్టర్లను విడుదల చేశారు.